Mahaa Daily Exclusive

  త్వరలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు: మంత్రి పార్థసారథి..!

Share

AP: త్వరలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విశాఖలో లక్షా 29 వేల ఇళ్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. 78 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.