తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు. గ్రామ తెదేపా నాయకుడు ప్రకాష్ రావు, శ్రీదేవి దంపతులు బుధవారం షిర్డీ బయల్దేరి వెళ్లారు. వచ్చి చూసేసరికి ఇంట్లోని బీరువాలు, కబ్బోర్డులు తెరిచి దాదాపు 960 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరించారు. దేవుడి గదిలో ఉన్న బంగారు ఆభరణాన్ని మాత్రం వదిలేయడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది.
Post Views: 87







