Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం .. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత…!

Share

హైదరాబాద్, మహా
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) బుధవారం రాత్రి 10.10 నిమిషాలకు నగరంలోని ఏఐజీ ఆసుపత్రి లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1952, సెప్టెంబర్ 14న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Latest