- చేరికల్లో గందరగోళానికి తెర
- ఎట్టకేలకు తూర్పు నుంచి బిఆర్ఎస్ గూటికి 3+1 తాజా, మాజీలు
- ఒకవైపు కుమారుడి రిసెప్షన్.. మరోవైపు నరేందర్ వ్యూహాత్మక ఎత్తుగడలు
- తూర్పు నుంచి చీమ చిటుక్కుమన్న నాకు తెలియాల్సిందే!
- రాజకీయ పంతం నెగ్గించుకుంటున్న మాజీ ఎమ్మెల్యే
వరంగల్, బ్యూరో మహా ;
తాజా మాజీల చేరికల్లో బెదిరింపులు, బుజ్జగింపుల తో వరంగల్ తూర్పు లో గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు తూర్పు నుంచి బిఆర్ఎస్ గూటికి 3+1 తాజా, మాజీలు చేరారు. ఒకవైపు కుమారుడి రిసెప్షన్, మరోవైపు నరేందర్ వ్యూహాత్మక ఎత్తుగడలు. “తూర్పు నుంచి చీమ చిటుక్కుమన్న నాకు తెలియాల్సిందే!” అని రాజకీయ పంతం నెగ్గించుకుంటున్న మాజీ ఎమ్మెల్యే. ఐనప్పటికీ తాజా మాజీలు మాజీ ఎమ్మెల్యేను కలువకుండానే నేరుగా సభలో పార్టీలో చేరుతున్న వైనం!
దీనికి తోడు
ప్రచార మాధ్యమాలలో విద్యాసంస్థల చైర్మన్ చేరిక పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
*చేరికల్లో బెదిరింపులు, బుజ్జగింపులు – గందరగోళం:*
తాజా మాజీలు అధికార పార్టీని వీడుతున్నారనే సమాచారం తెలుసుకున్న తూర్పు నేత ఒకరు బిఆర్ఎస్ లో చేరవద్దని తాజా మాజీలను బెదిరిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
తూర్పు నుంచి బిఆర్ఎస్ లోకి చేరికల విషయంలో గత 3 రోజులుగా తీవ్ర గందరగోళం నడిచింది.
చేరబోతున్న వారికి ఒకవైపు నుంచి బెదిరింపులు మరోవైపు నుంచి బుజ్జగింపులు*. “చేరొద్దు, ఆగు, మాతో వచ్చేయి, నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం” అని ఫోన్ కాల్స్, మధ్యవర్తుల బేరసారాలు.
కాంగ్రెస్ వర్గం నుంచి “ఆగిపోండి” అని ఒత్తిడి, బిఆర్ఎస్ వర్గం నుంచి “రండి” అని ఆహ్వానం. ఈ బెదిరింపులు, బుజ్జగింపుల మధ్య ఎట్టకేలకు 9నుంచి.. 6 నుండి నాలుగురి చేరికలు ఖరారయ్యాయి.
*ఎట్టకేలకు తూర్పు నుంచి బిఆర్ఎస్ గూటికి 3+1*
నేడు హనుమకొండ కేడీసీ మైదానంలో జన చైతన్య సదస్సు నిర్వహించనున్న సందర్భంగా, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
*చేరనున్న వారు – 3+1 లిస్ట్:*
*ఏకశిలా విద్యా సంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి* విద్యాసంస్థల చైర్మన్, తో పాటు తూర్పు నుండి
1 *భోగి సువర్ణ సురేష్ – 37వ డివిజన్* – కాంగ్రెస్ తాజా మాజీ కార్పొరేటర్
2. *ముష్కామల్ల అరుణ సుధాకర్ – 33వ డివిజన్* – కాంగ్రెస్ తాజా మాజీ కార్పొరేటర్
3. *వస్కుల బాబు – 18వ డివిజన్* – కాంగ్రెస్ తాజా మాజీ కార్పొరేటర్
4. *వీర్ల బిక్షపతి – 3వ డివిజన్*
మాజీ కార్పొరేటర్
*నరేందర్ ఎత్తుగడలు చెళ్లేనా?*
ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్ జరుగుతుండగా, మరోవైపు నరేందర్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు.
రిసెప్షన్ తో పాటు కూడా రాజకీయంగా నరేందర్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారని చేరికలు తన ఆధ్వర్యంలోనే జరగాలని పంతం పట్టి పక్కా ప్లాన్ చేశారు.
నరేందర్ ఎత్తుగడలు తూర్పులో ప్రత్యర్థులకు అంతు చిక్కడం లేదు. ఎప్పుడు, ఎవరిని, ఎలా టార్గెట్ చేసి తీసుకొస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు బిఆర్ ఎస్ పార్టీ పెద్దలు ఒకరు మాజీ ఎమ్మెల్యేను బుజ్జగించి తాజా మాజీలు ఆయనను కలవకుండానే చేరడానికి ఒప్పించారని తెలుస్తోంది.
*తూర్పు నుంచి చీమ చిటుక్కుమన్న నాకు తెలుస్తుంది!*
తూర్పు నుంచి చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాల్సిందే” అని మాజీ ఎమ్మెల్యే పంతం పట్టారు.
తూర్పులో తన అనుమతి లేకుండా ఏ చేరిక, ఏ కార్యక్రమం జరగదు అన్న ధోరణిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. తూర్పు తన అడ్డా, తన ఆధిపత్యం కొనసాగాలనే పంతంతోనే ఈ చేరికలను తానే ముందుండి నడిపించాలని అనే పంతం నెగ్గించుకోవడానికి నరేందర్ పక్కా వ్యూహం వేశారని తూర్పు బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
*విద్యాసంస్థల చైర్మన్ చేరిక పై తీవ్ర విమర్శలు*
ప్రచార మాధ్యమాలలో మాత్రం ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి చేరికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్య తో వ్యాపారం చేసేవారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలు ఎలా చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యాసంస్థల అధినేత రాజకీయాల్లోకి ఎందుకు? విద్యా వ్యాపారానికి రాజకీయ అండ కావాలా?” అని కూడా విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ఆయన అనుచరులు మాత్రం – తిరుపతి రెడ్డి చేరితే తూర్పులో బిఆర్ఎస్ కు విద్యావంతుల, యువత అండ దొరుకుతుంది” అని చెబుతున్నారు.








