Mahaa Daily Exclusive

  బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకురాలు..

Share

కారేపల్లి, మహా :సింగరేణి మండల పరిధిలోని తొడితల గూడెం గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురై మృతి చెందగా ఆదివారం దశదినకర్మకు వైరా బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చందు నాయక్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు,