Mahaa Daily Exclusive

  అక్రమార్కుల బరితెగింపు,….

Share

అక్రమార్కుల బరితెగింపు,
కొండాపూర్ సర్వే నెంబర్ 59గల్లంతు,
ఆరు వందల గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ,
విలువ రు 10 కోట్ల పై మాటే,
నకిలీ పత్రాలతో అనుమతులు,
రెండు నిర్మాణాలకు స్టిల్ట్ ప్లస్ మూడు ఫ్లోర్లకు పర్మిషన్లు,
నిర్మించేది మాత్రం ఏడు ప్లోర్లు ఆపైన పెంట్ హౌస్ నిర్మాణాలు,
సర్వే నెంబర్ 60 లో జి హెచ్ ఎం సీ అనుమతులు పొంది,
సర్వే నెంబర్ 59 లో గల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు,
టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు,
సి ఎం సి కమీషనర్ స్పందించాలంటున్న స్థానికులు.

కొండాపూర్ లో అక్రమార్కలు బరితెగించారు.. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పక్కా స్కెచ్ వేసి దురాక్రమణకు తెగబడుతున్నారు… నకిలీ పత్రాలు సృష్టించి జి హెచ్ ఎం సి నుండి అనుమతులు పొంది నిర్మాణాలు సాగించటం ఇక్కడ పరిపాటిగా మారింది.. ఆరు వందల గజాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రు 10 కోట్ల పైమాటే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.. ప్రభుత్వ భూమి కబ్జా కు గురైందని రెవె న్యూ అధికారలుకు పిర్యాదు చేసిన కబ్జా దారులతో కుమ్మక్కుయ్యారని ఎటువంటి చర్యలు తీసుకోలేదని బహిరంగ ఆరోపణలు వ్యక్త మౌతున్నాయి.. అనుమతులు మించి నిర్మాణాలు సాగిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి..