Mahaa Daily Exclusive

  యూట్యూబర్ ఓకే సాయిది రూ.100 కోట్ల స్కాం…..

Share

యూట్యూబర్ ఓకే సాయిది
రూ.100 కోట్ల స్కాం…

*ఆన్లైన్ మోసాలతో కోట్లకు పడగెత్తిన సాయినాథ్

*మోసపోయిన వేలాది మంది మధ్యతరగతి యువత

*కారేపల్లి పీఎస్ లో చీటింగ్, ఐటీ యాక్ట్ కేసులు

*ఓకే సాయి స్కాం ను బయటపెట్టిన మహా

*కేసు కాలేదని బుకాయిస్తున్న కేటుగాడు

*కోటి ఖర్చు చేసైనా నీ అంతు చూస్తానని మహా రిపోర్టర్ కు ఫోన్లో బెదిరింపులు

కారేపల్లి, మహా:మధ్యతరగతి యువత అవసరాలను వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యూట్యూబర్ ఓకే సాయి 100 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది యువకులు ఎటువంటి పెట్టుబడులు లేకుండా నే డబ్బులు సంపాదించవచ్చు అని ఈ మోసగాడి వలలో పడి నష్టపోయారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్న ఈ మోసగాడి పై కారేపల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*బిజినెస్ యాప్ ల పేరుతో వంచన..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యా తండాకు చెందిన బానోత్ సాయినాథ్ ఓకే సాయి పేరు తో యూట్యూబర్ గా మారి అనేక ఆన్లైన్ అక్రమాలకు పాల్పడి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తాడు. మొదట లీడ్స్ ఆర్క్ పేరుతో చైన్ లింకింగ్ ద్వారా యువతను మోసం చేశాడు. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ యాప్ లపై కొంత అవగాహన పెంచుకొని వాటి ద్వారా అమాయక యువతను వలలో వేసుకొని కోట్లు సంపాదించాడు. డ్రాప్ షిప్పింగ్ ద్వారా తాను నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానని నేను చెప్పే స్కిల్స్ ను మీరు కూడా నేర్చుకుంటే మీరు కూడా కోటీశ్వరుడు కావచ్చనీ మాయమాటలతో వందలాదిమందిని మోసం చేశాడు. అఫీలియేట్ మార్కెట్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఇన్నర్ సర్కిల్ తదితర యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఒక్కొక్కరి నుంచి 11000 నుంచి 18 వేల రూపాయలు దాకా కట్టించుకొని మోసం చేశాడు.
*డాక్టర్ అవతారం ఎత్తి మలేషియా యువతిని చీట్ చేశాడు…
డాక్టర్ గా చెప్పుకుంటూ ఓ మ్యాట్రిమోనీ లో ఫేక్ ప్రొఫైల్ పెట్టి మలేషియా కు చెందిన ఓ యువతి నీ వంచించాడు. ఈ యువతీ వద్ద మూడు లక్షల రూపాయలు తీసుకొని ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుండగా ఆ యువతి ఇండియా వచ్చి ఫిర్యాదు చేసింది. 2019లో రాచకొండ పోలీసు స్టేషన్లో ఓకే సాయి పై కేసు కూడా నమోదు అయింది. ఈ చీటింగ్ పై టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్ లో న్యూస్ ఐటమ్స్ కూడా పబ్లిష్ అయ్యాయి.
*మోసపోయిన ఆంధ్ర యువకులు సాయి ఇంటి ముందు ఆందోళన…
ఓకే సాయి చేతిలో మోసపోయిన కొందరు ఆంధ్ర యువకులు జనవరి 11వ తేదీన కారేపల్లి వచ్చి కారేపల్లి లో ఉన్న ఓకే సాయి ఇంటి ముందు బిగ్గెస్ట్ స్కామర్ అని బోర్డు పెట్టి ఆందోళన చేశారు. ఆంధ్రకు చెందిన విప్పర్తి దిలీప్ రూ.21998, కొల్లి మనోహర్ రూ.21289, చంద్రహాస రెడ్డి రూ.35000, బంటి అజయ్ రూ.85000, నరసింహులు రూ.34500, అర్ధాని శ్రీనివాస్ సూర్య భాను అన్నా చెల్లెలు కలిసి రూ.1,35000, శ్రీ పవన్ సాయి రూ.75000, ఉమేష్ సూర్య రూ.1,90000 ఓకే సాయికి చెల్లించి మోసపోయామని పేర్కొంటూ ఆందోళన చేసిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వందలాదిమంది తక్కువ డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు మోసపోయామని బయట చెప్పుకోలేక వదులుకున్న వారే వందల్లో ఉంటున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్ లో ఈ మోసగాడి బాగోతం బయటపడింది.
*వేద మీడియా ద్వారా బాధితులంతా గోడు వినిపించారు…
ఓకే సాయి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు వేద మీడియా ద్వారా వారి గోడు వెల్లపుచ్చారు. మాయ మాటలు చెప్పి మధ్యతరగతి యువతను మోసం చేస్తున్న ఓకే సాయి మాటలు ఎవరు నమ్మొద్దని వారు మోసపోయిన తీరును వివరించారు. మహేష్, వంశి తో పాటు కొందరు యువకులు వారు మోసపోయిన తీరును ఆధారాలతో సహా వెల్లడించారు.
*సాయి మోసాలను బయటపెట్టిన వైజాగ్ రవి…
వైజాగ్ కు చెందిన రవి అనే యూట్యూబర్ ఓకే సాయి మోసాలపై ఆధారాలతో వదిలిన వీడియో సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయింది. మోసపోయిన వారు ఓ సినిమాలో డైలాగ్ లాగా పోయాం మోసం అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన వాయిస్ లు.. మోసపోయిన తీరు నవ్వించే విధంగా ఉన్నాయి. ఓకే సాయి చేతిలో మోసపోయిన సుమారు 50 మంది వీడియో వాయిస్ లను వైజాగ్ యూట్యూబర్ విడుదల చేయడంతో ఓకే సాయి బండారమంతా వెలుగులోకి వచ్చింది.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వారం రోజుల్లోనే లక్షాధికారి కావచ్చని మాయమాటలు చెప్పి అనేక మందిని కోర్సుల్లో చేర్పించుకొని చేరిన వారి నుంచి వేల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడనే ఆరోపణలు ఓకే సాయి పై సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. మోసపోయిన వారు వారి వీడియో వాయిస్ ద్వారా యూట్యూబర్ రవికి వివరించారు. మోసపోయిన వారు చాలా మంది మోసపోయిన తీరుతోనే నవ్వుల పాలై పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి మరోసారి నవ్వుల పాలు కావడం ఎందుకని చాలా మంది వదిలేసారు. 788 మంది నుంచి 18 వేల రూపాయల చొప్పున వసూలు చేశాడని విషయం యూట్యూబర్ రవి ఆధారాలతో సహా యూట్యూబ్లో వీడియోను విడుదల చేశాడు. వేదా మీడియా ద్వారా కూడా చాలామంది యువకులు మోసపోయిన తీరును వివరించారు కాబట్టి నిఘా వ్యవస్థలు దీన్ని తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి ఆన్లైన్ మోసాలకు పాల్పడే ఒకే సాయిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది….