కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గోవిందు తండా గ్రామానికి చెందిన బర్మావత్ వీరు (32) ఇటీవల గుండెపోటుతో మరణించారు.శనివారం కుటుంబసభ్యులు నిర్వహించిన వీరు పెద్దకర్మ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ సోదరుడు వేర్ హౌసింగ్ గోదాం రిటైర్డ్ జిల్లా మేనేజర్ సుందర్ లాల్ పాల్గొన్నారు.మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.కుటుంబ సభ్యులకు కొంత నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బర్మావత్ కోటి, బానోతు రాజేష్,విజయ్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 79







