Mahaa Daily Exclusive

  పేదల ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్..

Share

  • పేదల ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్
  • గేట్ కారేపల్లి లో మహిళలకు చీరల పంపిణి

కారేపల్లి, మహా: రాష్ట్రం లో ఉన్నది పేదల ప్రభుత్వమని పేదల ప్రతి అవసరాన్ని కాంగ్రెస్ సర్కార్ తీర్చే పనిలో ఉందని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ అన్నారు. శనివారం రాత్రి కారేపల్లి మండలం గేట్ కారేపల్లి లో గుడిపూడి తిరుమలరావు ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళ లకు చీరల పంపిణి చేపట్టారు. గుడిపూడి వెంకటరావమ్మ జ్ఞాపకార్థం నిర్వహించిన కారేపల్లి, కామేపల్లి మండలాల స్ధాయి క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  మహిళల సాధికారిత దిశగా సంక్షేమ పథకాల ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 10 ఏండ్ల  టిఆర్ఎస్ పాలనలో మహిళలు వివక్షతకు గురైనారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్ సౌకర్యం, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లను మహిళలకు ఇస్తుందన్నారు. ఉచిత రేషన్ బియ్యాన్ని తినకుండా అమ్మకానికి పెట్టారని, నేడు సన్నబియ్యం పంపిణితో ప్రతిరేషన్ కార్డుదారులు సన్నబియ్యం తింటున్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రూ.8 లక్షల కోట్లు అప్పుపెట్టిపోయాడని వాటిని సర్దుబాటు చేస్తూ సంక్షేమం,అభివృద్ధికి ఆటంకం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు ఉండకూదని, మరో ఏడాదిలో రేకులు, గుడిసెలు లేని పల్లెలు కనపడతాయన్నారు.  గేటుకారేపల్లికి చెందిన గుడిపూడి తిరుమలరావు సేవాపరుడని అతని నాయకత్వంలో 1000 మంది మహిళలకు చీరలు పంపిణి చేయటం, యువతన ఆకర్షించి వారికి క్రీడాపోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు.  ఈకార్యక్రమంలో కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, ఎల్లయ్య, డీసీసీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, నాయకులు అడ్డగోడ ఐలయ్య, నర్సింగ్ శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, అనీఫ్, సామినేని తిరుపతయ్య, గుడిపూడి నర్సయ్య, జక్కుల కుమార్, పావని, వడ్డె అనంతరామయ్య, కడియాల సుధాకర్, సర్పంచ్ లు మేదరి వీరప్రతాఫ్, అంగోత్ మత్రు, ఈసం మోతీరస్వామి,బానోత్ హిరాలాల్, బానోత్ బాలు,  వడ్డె సులోచన రంగారావు తదితరులు పాల్గొన్నారు.