Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా MGR పాదయాత్ర..!

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా గత రెండు నెలలుగా కలుషిత తాగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యలను స్వయంగా పరిశీలించి, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అనంతరం HMWSSB మేనేజర్ నదీమ్ గారు మరియు GHMC AE భరత్ గారితో మాట్లాడి, రెండు రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా మూడు గుళ్ల వద్ద వర్షపు నీటి లైన్ ఓవర్‌ఫ్లో అవుతున్న సమస్యపై కూడా అధికారులతో చర్చించారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.42 లక్షల వ్యయంతో రోడ్డు మరియు వర్షపు నీటి లైన్ పనులకు ఇప్పటికే అనుమతులు లభించాయని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఓల్డ్ CIB క్వార్టర్స్, ఇంద్రానగర్, శ్రీనివాస్ నగర్, BJR నగర్, మారుతీ నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న కలుషిత తాగునీటి సమస్యను వాటర్ వర్క్స్ మేనేజర్ నదీమ్ గారి దృష్టికి తీసుకెళ్లి, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న MGR గారి ప్రజా పోరాటం నిరంతరం కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్, సీనియర్ నాయకులు శ్యామ్ గౌడ్, శ్రీనివాస్, అశోక్, దీపు, అంజన్ కుమార్, రాహుల్, అబ్బాస్తో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.