- ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలి
- టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మహా : వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాలని, బీసీ కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు లో పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలకు హాజరుకావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం ఈరోజు హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి ఆహ్వానించారు. అనంతరం మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహేష్ గౌడ్ ఆవిష్కరించారు
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో బీసీలకు చట్టబద్ధమైన హక్కులు దక్కాలంటే జాతి జనగణలో సమగ్ర కులగనన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, మహిళా బిల్లులు బీసీ మహిళలకు సబ్ కోట, డీలిమిటేషన్ డిమాండ్లపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున పోరాడుతామని, ఇందుకు రాహుల్ గాంధీని ఒప్పిస్తామన్నారు. ఆగస్టు 7 న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ కు బీసీలు హాజరై విజయవంతం చేయాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు.
దేశంలో సగభాగానికి పైగా ఉన్న బీసీల హక్కుల సాధన కోసం కోట్లాదిమంది బీసీలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకం చేసి గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలను రగిలిస్తామనీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా బిసి ఉద్యమాన్ని విస్తరించడానికి ఆగస్టు ఏడో తేదీన ప్రతి సంవత్సరం జాతీయ సభలను ఓబీసీ మాసభలను ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, నాగపూర్, హైదరాబాద్, తిరుపతి, అమృత్ సర్, గోవా లో నిర్వహించి ఈసారి బెంగుళూరులో నిర్వహిస్తున్నామని, బెంగళూరులో నిర్వహించే ఈ సభకు దేశం నలుమూలల నుండి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం డైలీమిటేషన్ మరియు మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించుకోవాలని, బీసీల రాజకీయ రిజర్వేషన్లు కల్పించకుండా మహిళా బిల్లు, అలాగే డిలిమిటేషన్ బిల్లును పెట్టిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించి ఆమోదించకుండా అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, నాయకులు కౌలే జగన్నాధం, టి సత్య గౌడ్,
బండి గారి భరత్, తదితరులు పాల్గొన్నారు.








