- నెక్కొండ ఎస్సై మహేందర్ పై సస్పెన్షన్ వేటు
- వరంగల్ సీపీ ఎన్ శ్వేతా రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
వరంగల్, క్రైమ్ ;
వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం వరంగల్ సీపీ ఎన్. శ్వేతా రెడ్డి ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఎస్సై మహేందర్ పై
అవినీతి ఆరోపణల నేపథ్యంలో శాఖాపరంగా విచారణ చేపట్టగా ప్రాథమిక ఆధారాలను గుర్తించి సస్పెండ్ చేశారని తెలుస్తోంది.
ఎస్ ఐ స్పెన్షన్ నేపథ్యంలో నెక్కొండ లో ప్రజలు స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రజలు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
కాగా ఎస్ఐ మహేందర్ సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు వరంగల్ కమిషనరేట్ నుంచి ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Post Views: 34








