- సీపీఐ(ఎం) నాయకులు ఎర్రబెల్లి లక్ష్మయ్య మృతి
- సమరశీల కమ్యూనిస్టు ఎర్రబెల్లి లక్ష్మయ్య – సీపీఎం
కారేపల్లి , మహా: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కారేపల్లి మండలం గుంపెళ్లగూడెంకు చెందిన ఎర్రబెల్లి లక్ష్మయ్య(60) మంగళవారం మృతి చెందారు. కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మయ్య పరిస్ధితి విషయమించటం మృతి చెందారు. ఆయన మృతదేహాంలోపై సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, సీనియర్ నాయకులు తుమ్మోజు రాంమూర్తిలు సీపీఎం పతాకాన్ని కప్పి నివాళ్లు ఆర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించటంలో సమరశీలమైన కమ్యూనిస్టు ఎర్రబెల్లి లక్ష్మయ్య అని కొనియాడారు. మాదారం, గుంపెళ్లగూడెం ప్రాంతాలలో పేదలకు ఇండ్లు, త్రాగునీటి సమస్య, కుల వివక్షతకు వ్యతిరేకం జరిగిన పోరాటంలో ముఖ్యభూమికి పోషించారన్నారు. గుంపెల్లగూడెం గ్రామాభివృద్ధిలో ఎర్రబెల్లి లక్ష్మయ్య పాత్ర మరవలేనిదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి, ఎర్రజెండాను భుజాన మోసి కడవరకు ఎర్రజెండా నీడనే చేదతీరిన ఆదర్శ కమ్యూనిష్టు ఎర్రబెల్లి లక్ష్మయ్య అని అన్నారు. ఎర్రబెల్లి లక్ష్మయ్య ఆచరించిన సిద్దాంతం, పోరాట స్పూర్తి అనుసరనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, మండల కమిటీ సభ్యులు గుర్రం వెంకన్న, నాయకులు పాపినేని నాగేశ్వరరావు, గుంపెళ్లగూడెం శాఖ కార్యదర్శి లక్ష్మయ్య చిన్న కుమారుడు ఎర్రబెల్లి సతీష్, పెద్ద కుమారుడు రాము, నాయకులు పొట్లకాయల రమేష్, ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, భాగం వెంకటప్పారావు, వేములపల్లి రమణ, కళాకారుడు ఎర్రబెల్లి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.








