Mahaa Daily Exclusive

  బాధితుడికి అండగా ఉంటాం మంత్రి సవిత

Share

వ్యాన్ ఢీకొట్టడంతో 14 గొర్రెలు మృతి చెందగా, గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పందించారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తోను, పశు సంవర్ధక శాఖ జేడీ సుభదాస్ తోను మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక అందివ్వాలని స్పష్టం చేశారు. క్షతగాత్రుడు ఓబులపతి కుటుంబ సభ్యులతోనూ మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Latest