తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. జనవరి 13వ తేది నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని సీఎం ఏసీబీ కోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు.. రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
గతంలో ఓటుకు నోటు కేసు బెయిల్ సందర్భంగా పాస్‌పోర్టును సీఎం రేవంత్‌రెడ్డి కోర్టుకు అప్పగించారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్టును 6 నెలలు ఇవ్వాలనే సీఎం అభ్యర్థనకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. మళ్లీ 2025 జులై 6వ తేది లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని రేవంత్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది
Post Views: 82








