ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని కుప్టి గ్రామం వద్ద 44 వ జాతీయ రహదారి పక్కనే కోట్ల విలువ చేసే ఎర్రమట్టి ని బకాసురులు మింగేస్తున్నారు. ఎర్ర మట్టి ఒక్కో టిప్పర్ విలువ దాదాపు 12 వేలకు పైగా ఉండగా ప్రతీ రోజు అర్ధరాత్రి అయితే చాలు పెద్ద పెద్ద మిషన్ లను పెట్టి గుట్టలు గుట్టలనే తవ్వేస్తూ టిప్పర్ లతో ఎర్రమట్టి ని తరలిస్తున్నారు. ప్రతీ రోజు లక్షల్లో దందా చేస్తూ అడ్డొచ్చిన చెట్లను సైతం నరికేస్తూ హద్దు అదుపు లేకుండా ఇష్టరీతినా దందా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న అటు మైనింగ్ అధికారులు ఇటు అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి గుట్టలతో కనువిందుచేసే కుప్టి అందాలు తరిగిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 58








