Mahaa Daily Exclusive

  కలెక్టరేట్​లో గొడవకు దిగిన ఎమ్మెల్యేలు – ఒకరినొకరు తోసుకున్న కౌశిక్​ రెడ్డి, సంజయ్ …!

Share

కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కలెక్టరేట్ లో అధికారిక సమీక్షలో ఢీ అంటే ఢీ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతుండగా.. ఆయన్ను కౌశిక్‌ రెడ్డి నిలదీశారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. దళితులు, రైతుల పక్షాన కాంగ్రెస్‌ నాయకులను నిలదీశారు. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో పాడి కౌశిక్‌ రెడ్డి, సంజయ్‌ మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త తోపులాటకు దారితీయడంతో కౌశిక్‌ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది.

Latest