Mahaa Daily Exclusive

  సమోసాలో బ్లేడ్‌.. కొనుగోలు చేసిన వ్యక్తి షాక్‌

Share

సమోసా తింటుండగా అందులో బ్లేడ్‌ ముక్క కనిపించింది. దీంతో అతను షాక్‌ కు గురయ్యాడు. అది విక్రయించిన వ్యక్తిని అతను నిలదీశాడు. అయితే, ఆ విక్రయదారుడు సరైన సమాధానం ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి దీని గురించి సంబంధిత పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో చోటు చేసుకుంది. నివాయ్ టౌన్‌కు చెందినకు చెందిన ఓ వ్యక్తి, స్థానికంగా ఉన్న ఓ షాప్ నుంచి నుంచి కచోరీ, మిర్చీ బజ్జీలు, సమోసాలు కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లిన తర్వాత ఒక సమోసాను విరిచాడు. అందులో షేవింగ్‌ బ్లేడ్‌ ముక్క ఉండటం చూసి షాక్‌ అయ్యాడు. ఆ వెంటనే ఆ సమోసాతోపాటు సదరు షాపు వద్దకు వెళ్లాడు. సమోసాలో బ్లేడ్‌ ముక్క ఉండటాన్ని అతనికి చూపించాడు. అయితే షాపులోని వ్యక్తి విచారం వ్యక్తం చేయకుండా పైగా అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి బలవంతంగా పంపించేశాడు. దీంతో బాధితుడు పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆ షాపు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. అదేవిధంగా పోలీసులు కూడా ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest