Mahaa Daily Exclusive

  మోదీ మాటలు నష్ట నివారణ కోసమే – కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌..!

Share

ఇటీవలే కాలానికి సంబంధించిన ప్రధాని మోదీకి సంబంధించిన ఇంటర్వ్యూపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. ‘ఇదే వ్యక్తి (ప్రధాని మోదీ) 8 నెలల క్రితం తనను తాను దేవుడి ప్రతినిధిగా చెప్పుకున్నారు. తాను మానవుడిగా పుట్టినప్పటికీ, దేవుడి దూతగా ప్రకటించుకున్నారు. తనకు మానవ జన్మ నుంచి కాదు, దేవుడి నుంచి శక్తి వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగారు. అందులో భాగంగానే తానూ అందరిలాంటి మనిషినేనని వివరణ ఇచ్చుకున్నారు’ అంటూ జైరామ్‌ రమేశ్‌ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… ‘నేను భగవంతుడినేమీ కాదు.. మానవుడిని మాత్రమే. నేను జీవితంలో దుర్దుదేశంతో తప్పులు చేయలేదు. అయితే పొరపాట్లు చేసుండొచ్చు’ అంటూ ఆ ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైన దేశ వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Latest