Mahaa Daily Exclusive

  భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు..!

Share

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథికి సంబంధించిన సమాచారం ప్రతిసారి కొన్ని నెలల ముందే ప్రకటన వెల్లడిస్తారు. కానీ, ఈసారి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. భారత పర్యటనలో భాగంగా సుబియాంటో ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించి ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.