Mahaa Daily Exclusive

  మస్క్ చేతికి టిక్ టాక్..!

Share

టిక్ టాక్… ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటుంది. చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేసింది. ఒకప్పుడు భారత్‌లో టిక్‌టాక్ సృష్టించిన వీడియో సునామీ అంతా ఇంతా కాదు. అయితే గాల్వాన్ లోయలో చైనా పాల్పడిన దుశ్చర్య క్రీడతో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించింది. దీంతో చైనా అతిపెద్ద మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక టిక్‌టాక్ భారత్ నుంచి కనుమరుగవుతూనే ఇతర షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌కు మార్గం సుగుమం చేసి పోయింది. చాలా కాలం తర్వాత భారత్‌లో టిక్‌టాక్ మాట వినిపించింది. టిక్ టాక్  ద్వారా ఇతర దేశాల ముఖ్య సమాచారాలను చైనా సేకరిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ఎక్స్ బాస్ అయిన ఎలాన్ మస్క్‌కు అమ్మేయాలనే ఆలోచన చేస్తోంది చైనా.