Mahaa Daily Exclusive

  పండుగ పూట విషాదం..ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం…!

Share

కాకినాడ: ఏలేశ్వరంలో మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా షాప్‌లోకి స్పోర్ట్స్ బైక్ దూసుకుపోయింది. బైక్ అదుపు తప్పి యర్ర అబ్బాయి (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు పండు (20) పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది