Mahaa Daily Exclusive

  అక్షంతలు తప్ప అభివృద్ధి చేయని బీజేపీ నిధుల కేటాయింపు లో తీవ్ర నిర్లక్ష్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డ – మంత్రి సీతక్క

Share

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతుంది తప్ప అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణనకు నిధుల విషయంలో చూపిన వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ట్యాంక్ బండ్ వద్దనున్నఅంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు, ప్రధాని వద్దకు ఎన్ని సార్లు వెళ్ళినా చివరకు మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. నిన్నటి బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప కేంద్ర బడ్జెట్ కాదన్నారు. నిర్మలమ్మ ప్రవేశపెట్ింది బీజేపీ బడ్జెట్ స్వార్ధ బడ్జెట్ అని సీతక్క వ్యాఖ్యానించారు. మొదటి నుంచీ తెలంగాణ అంటే బీజేపీ కి పిచ్చి విధ్వేషమని, అడుగడుగునా తెలంగాణను మోడీ ప్రభుత్వం కించపరిచే విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని, రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం సహాయ నిరాకరణ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ఉన్న నిధులతో అభివృద్ధి సంక్షేమం చేస్తుందన్నారు. బీజేపీ వాళ్ళు కేవలం అయోధ్య నుంచి అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధి కి నిధులు ఇవ్వడం లేదని సీతక్క వ్యాఖ్యానించారు. విభజన చట్టం లోని హామీలు మూడు సార్లు అధికారం లోని వచ్చిన అమలు చేయలేదన్నారు.
అక్షింతలకు ఓట్లు వేద్దామా, అభివృద్ధికి ఓటు వేద్దామా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సీతక్క పిలుపునిచ్చారు. చేసిన తప్పును తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు నిధులు కేటాయించాలని సీతక్క డిమాండ్ చేశారు.

Latest