Mahaa Daily Exclusive

  తెలంగాణకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..? చర్చకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సవాల్…!

Share

వికసిత భారత్ 2047 విజన్ లక్ష్యంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను రూపొందించి ప్రవేశపెట్టారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులేమీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తెలంగాణలో మూడు ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్రిబుల్ ఆర్ కు కేంద్రమే నిధులిస్తుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్ర నిధుల ద్వారానే పునరుద్దరించడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా లాంటి గడ్డు పరిస్థితి తర్వాత నరేంద్ర మోడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్య.వస్థను గాడిలో పెట్టడం జరిగిందన్నారు. 2014 లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు దాన్ని ఏకంగా 12 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఇదొక మైలు రాయి అని, దశాబ్ధకాలంలో మోడీ ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారన్నారు. మధ్య తరగతి ప్రజలతోనే దేశ ఆర్థిక పరిస్థితి సాధ్యమని గుర్తించిన నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చారిత్రాకత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. సామావ్యుడికి కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చి దిద్దారని పేర్కొన్నారు.

ఇవన్నీ గుర్తించని ప్రతిపక్ష పార్టీలు కళ్ళులేని కబోదుల్లా మారి విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు తెలంగాణలోని మెదక్ ను కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పుకున్నారని, దాదాపు 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ మెదక్ కు రైలు మార్గం వేయలేకపోయారని విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే మెదక్ కు రైలు మార్గం వేయడంతో పాటు రైలును నడిపిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎవరి హయాంలో ఏం చేశారో, ఎంత అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు.

Latest