అయోధ్య: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళా లో ఇప్పటి వరకూ 34 కోట్ల మంది త్రివేణి సంగమ స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మిల్కిపూర్ అసెంబ్లీ నియోజవర్గంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరువాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించిందని, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిందని, గత రెండు నెలలుగా ఆ పార్టీ చీఫ్ మహాకుంభ్‌కు వ్యతిరేకంగా టీట్లు చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈరోజు వరకూ 34 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని చెప్పారు.
Post Views: 115








