ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చారిత్రాత్మక విజయందిశగా సాగుతుండగా, బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది’ అని ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా వేధింపులు గురిచేసినా ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.
Post Views: 174








