పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సోమవారం అశ్వాపురం, మణుగూరు ఉమ్మడి మండలాల యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు రేగులగండి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, పెద్దిరాజు, శేషయ్య, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Post Views: 94








