Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం .. పొన్నం సంచలన ఆరోపణ…!

Share

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్‌ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపకుండా ప్రత్యక్షంగానే బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు జరిగాయి. మరీ వారిద్దరు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిందని, ఈ ఓటమిపై సమీక్షించుకుని పుంజుకుంటామని తెలిపారు.