డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ‘DSC నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా కేసులయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.
Post Views: 73







