Mahaa Daily Exclusive

  పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెంచేలా కషి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

Share

ఆదిలాబాద్, మహా
కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నీతి, నిజాయితీలతో విధులు నిర్వర్తించాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ సేవలందించాలని ప్రజలకు సేవలందించాలని తెలపారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి స్పెషల్ బ్రాంచ్ అనేది నిఘా వ్యవస్థలా పనిచేస్తుందని, అనునిత్యం ప్రజలతో కలిసి ఉంటూ సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. ముందస్తుగా సేకరించిన సమాచారాన్ని అధికారులకు అందించి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్స్ సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్, ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి. వెంకటి తదితరులు పాల్గొన్నారు.