జగిత్యాల,మహా:
నేడు జరగబోయే బక్రీద్ పండగ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిం దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతా లు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్స్ ను జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించి భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండగను అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దీని కోసం పోలీస్ శాఖ అవసరమైన భద్రతాయపరమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ నందు పోలీసు సిబ్బంది తో 24 గంటలు వాహనాల తనిఖీలు చేపట్టి పశువుల అక్రమ రవా ణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాల న్నారు.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన ,ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్, మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.







