Mahaa Daily Exclusive

  భూభారతి సదస్సును సందర్శించిన వరంగల్ కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ..!

Share

వరంగల్ మహా;

కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావు పేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని, ముందుగా వేయాలని సూచించారు.
అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని,
అదేవిధంగా చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్,డా. బాలకృష్ణ , మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలి అని తెలిపారు.

దామోదర్ రెడ్డి , ఏడిఏ నర్సంపేట, శాస్త్రవేత్తలు డా రాజు, శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి తో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

భూభారతి రెవెన్యూ సదస్సులు పరిశీలించిన కలెక్టర్

అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తదనంతరం….
లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

పర్వతగిరి మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం పర్వతగిరి మండల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు తో కలిసి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద 249 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.