రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
దేవాలయాలను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని, ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివానంద, షరీఫ్ లను అరెస్టు చేశారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా దేవాలయాల్లో ఉన్న పంచంలోహ విగ్రహాలను టార్గెట్ చేసినా ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చెందిన శివానంద్, షరీఫ్ మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారని తెలిపారు. దేవాలయాలలో చోరీ చేసిన పంచలోహ విగ్రహలు, ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారని, విగ్రహాలను కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్నారని, సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలనే వీరు టార్గెట్ చేస్తున్నారన్నారు. ప్రతి దేవాలయాల్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. నిందితుల వద్ద నుంచి ఐదు లక్షల విలువగల 61 కిలోల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని రాచకొండ కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి కేపివి రాజు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.







