రాజేంద్రనగర్ మహా:
తెలంగాణ రాష్ట్రంలో 94 వేల కోట్లు రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 తేదీ ఆదివారం హైదరాబాదు నగరానికి రానున్న సందర్భంగా హైదరాబాద్ చుట్టుముట్టు ముఖ్యంగా శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వరకు బిజెపి నాయకులు భారీ పోస్టర్లు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ వాల్ పోస్టర్లను కాంగ్రెస్ నాయకులు చించి వేస్తున్నారని బిజెపి డివిజన్ అధ్యక్షులు సూర్ రెడ్డి వినయ్ రెడ్డి ఆరోపించారు.
జిహెచ్ఎంసి అధికారుల ఒత్తిడితో జిహెచ్ఎంసి సిబ్బంది, నరేంద్ర మోడీ రాక కోసం ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లను, చించి వేస్తు సంబంధిత పోస్టర్లను డీసీఎంలలో తరలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 94 వేల కోట్ల రూపాయల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు పూర్తికాకముందే వాల్ పోస్టర్లు తొలగిస్తున్నారు. ఈ పోస్టులు కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి ఆదేశాలతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వినయ్ రెడ్డి ఆరోపించారు.








