Mahaa Daily Exclusive

  టోర్నమెంట్ విజేతగా నిలిచిన బీసీ కాలనీ జట్టు,రన్నరప్ గేటుకారేపల్లి జట్టు…

Share

  • టోర్నమెంట్ విజేతగా నిలిచిన బీసీ కాలనీ జట్టు,రన్నరప్ గేటుకారేపల్లి జట్టు
  • ఎన్నారై గుడిపూడి తిరుమలరావు,సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి వెంకటేశ్వర్లు చేతులమీదుగా ట్రోఫీ అందజేత

కారేపల్లి,మహా:
గత రెండు వారాల నుండి గేట్ కారేపల్లి పెద్ద చెరువు సమీపంలో నిర్వహించిన సింగరేణి,కామేపల్లి రెండు మండలాల స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిసాయి.ఫైనల్ మ్యాచ్ లో కారేపల్లి బీసీ కాలనీ,గేట్ కారేపల్లి తలపడగా,బీసీ కాలనీ జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతి రూ.25 వేలు,ట్రోఫీ గెలిచారు.ఆతిథ్య జట్టు గేటు కారేపల్లి రన్నరప్ గా నిలిచి ద్వితీయ బహుమతి రూ.15 వేలను గెలిచారు.టోర్నమెంట్లో గెలుపొందిన ఇరుజట్లకు సింగరేణి మండల సీనియర్ జర్నలిస్ట్,ఐజేయూ యూనియన్ జిల్లా నాయకులు కొండపల్లి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ట్రోఫీలను అందజేశారు.ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు గుడిపూడి తిరుమలరావు మాట్లాడుతూ..తన తల్లి గుడిపూడి వెంకటరావమ్మ జ్ఞాపకార్థం ఈ క్రీడా పోటీలను నిర్వహించామని,ప్రతి సంవత్సరం ఇదే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టు క్రీడాస్ఫూర్తితో ఆడారని,యువత అధిక సంఖ్యలో క్రీడల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు.రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని తిరుమలరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూక్య చిట్టిబాబు,గుడిపూడి నరసయ్య దుగ్గినేని సత్యనారాయణ,జక్కుల కుమార్,కుసుమ,నాగరాజు,చెరుకూరి రామారావు,కంటగాని కమలాకర్,కంటగాని కిషోర్,భూక్యా విజయ్,సాయి,లాయర్ నరసింహ,జంగా వెంకటేశ్వర్లు,సింగరేణి వార్డు మెంబర్ రాజశేఖర్,సమ్మయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.