Mahaa Daily Exclusive

  కొండాపూర్ భూకబ్జాపై ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ గురి: ప్రభుత్వ భూమిలో అనుమతులు మించి భారీ అక్రమ నిర్మాణాలు

Share

స్పెషల్ టాస్క్ పోర్స్ మహా :సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగం పల్లి మండలం, కూకట్పల్లి జోనల్, మాదాపూర్ సర్కిల్ పరిధి కొండాపూర్ లో భూకబ్జా దారులు పెట్రేగిపోతున్నారు. సర్వే నెంబర్ 60 లో ఆరు వందల చదరపు గజాల స్థలం ఉన్నట్లు చూపించి రెండు భవనాలకు వేరు వేరుగా స్టిల్ట్ ప్లస్ మూడు ప్లోర్లు కు నిర్మాణ అనుమతులు పొందారు. కాని వాస్తవంగా సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా స్పష్టమౌతోంది.రెవెన్యూ అధికార్లకు పిర్యాదులు అందినప్పటికి కబ్జా దారులు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్ట జెప్పటంతో వారితో కుమ్మకై ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కుల చెరలో ఉన్న ప్రభుత్వభూమి విలువ రు 10కోట్ల పైమాటే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఓ నీరు పేద తల దాచుకొనేందుకు 50గజాల్లో గుడిసె వేసుకొంటే దాన్ని కూల్చేంత వరకు నిద్ర పోని రెవెన్యూ అధికారులు ఆరు వందల గజాల ప్రభుత్వ స్థలం అప్పనంగా ఆక్రమించుకొని నకిలీ అనుమతులతో బహుళంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు అడ్డుకొరని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొండాపూర్ ప్రధాన రహదారి వోక్స్ వ్యాగన్, కియా కార్ల షోరూం వెనుక వైపు అనుమతులకు మించి అక్రమంగా ప్రభుత్వ భూమి లో నిర్మిస్తున్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.