Mahaa Daily Exclusive

  టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే కొండాపూర్ భూదంద: రూ. 70 లక్షల ముడుపుల ఆరోపణలు!

Share

టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నలోనే :
హైదరాబాద్ మహా నగరం లో అత్యంత విలువైనా ప్రాంతంగా కొండాపూర్ ను పరిగణిస్తారు. ప్రధాన రహదారి పక్కన వొక్స్ వ్యాగన్,కియా కార్ల షోమ్ వెనుక వైపు ప్రభుత్వ భూమిలో జరుగుతున్నా బహుళంతస్తుల నిర్మాణాలు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్కిళ్లు విభజన కాక ముందు శేరిలింగంపల్లి జోనల్, చందానగర్ సర్కిల్ నుండి నిర్మాణ అనుమతులు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం కూకట్పల్లి జోనల్ పరిది మాదాపూర్ సర్కిల్ లో కొండాపూర్ ను కలపబడింది. దాంతో సర్కిల్ అధికారులు మాది కాదంటే.. మాది కాదంటూ.. ఒకరిపై ఒకరు నెపం వేసుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. ఆరు *వందల* చదరపు గజాల్లో ప్లాట్ నెంబర్ 13సి, లో 337.19 స్క్వేర్ మీటర్లు, ఫైల్ నెంబర్ 000216/జి హెచ్ ఎం సి /00206/ఐ ఏ బీ పీ /సి 21/2025,పర్మిట్ నెంబర్ 0140/జి హెచ్ ఎం సి /ఐ ఏ /సి 21/2025,ది 26/4/2025న, మరో ప్లాట్ నెంబర్ 001348/జి హెచ్ ఎం సి /0/1088/ఐ ఏ బి పీ /సీ 21/2025,పర్మిట్ నెంబర్ 0664/జి హెచ్ ఎం సి /ఐ ఏ /సి 21/2025ది 26/5/2025న అడ్డదారిలో ఆక్రమణ దారులు అనుమతులు పొందారు.అయితే అనుమతులు పొందింది రెండు బిల్డింగ్ లకు స్టిల్ట్ ప్లస్ మూడు ప్లోర్లకు కాని ఏడు అంతస్తులు ఆపైన పెంట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు.అధికారుల అండదండలు లేకుండా ఇదేలా సాధ్యం అవుతుందొ వారే చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావటమే కాకుండా అదనపు అంతస్తులకు రావాల్సిన లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖాజానకు చేరకుండా పక్కా దారి పడుతున్నాయి… ఇదిలా ఉంటే నిర్మాణాలు పూర్తి కాకుండానే ఓ. సి లు జారీ చేయటం ద్వారా రు 70లక్షలు రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.