Mahaa Daily Exclusive

  శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.?

Share

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.?

వర్షం పడితే చాలు నీరు జమ: ప్రజలకు ఇబ్బందులు.?
నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుంది.?
అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కరించాలి: ప్రజలు

ఇబ్రహీంపట్నం జూన్ 5 మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వెళ్లే రహదారిలో, అపోలో ఫార్మసీ ముందు వర్షం పడితే నీరు జమై రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది… గతంలో దుకాణదారులు పలుమార్లు అధికారులకు విన్నపించుకున్న నామమాత్రంగా పనులు చేసి వదిలేసారు. దీంతో సమస్య అలాగే ఉండిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు, దుకాణదారులకు ఇబ్బంది నెలకొంది. ఈ యొక్క వర్షపు నీరు నిల్వ ఉండడంతో మురుగుగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను కోరుచున్నారు..