ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రేమ్ నగర్ – సౌత్ ప్రేమ్ నగర్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఉదయం నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు, ప్రజలు తమ సమస్యలను MGR గారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వాటర్ సప్లై వచ్చిన తొలి 10 నిమిషాల పాటు తీవ్ర కాలుష్యంతో కూడిన నీరు రావడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.
అదేవిధంగా నాలా గల్లీలో రెండు క్యాచ్‌పిట్స్ నిర్మాణం, డీసిల్టింగ్ చేసిన మట్టిని వెంటనే తొలగించాలని కోరగా, MGR గారు వెంటనే GHMC డిప్యూటీ ఇంజనీర్ హరే రామ్ గారితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే సాయిబాబా గుడి కమాన్ కిందనున్న నాలా, బ్రిడ్జి వద్ద ఓపెన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, సంబంధిత అధికారులకు లేఖ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తానని MGR గారు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలే నా బాధ్యత… శాశ్వత పరిష్కారమే నా లక్ష్యం అనే సంకల్పంతో MGR గారు ప్రజల మధ్యే ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రమా ప్రభాకర్ రెడ్డి, రావుల విజయ్, శ్రీధర్ యాదవ్, శ్రీనివాస్ నాయుడు, నవీన్, శంకర్ ముదిరాజ్, రఘు, యూసుఫ్ భాయ్ , అన్వార్,మల్లేష్, ప్రేమ్ నగర్ సౌత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.








