- వరంగల్ లో బీఐఎస్ అధికారులు ముమ్మర తనిఖీలు
- రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్
వరంగల్, మహా ;
వరంగల్ నగరంలోని బంగారు ఆభరణాల దుకాణాల్లో బీఐఎస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ లేకుండానే విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించి పలు దుకాణాల్లోని ఆభరణాలను సీజ్ చేశారు. వివిధ దుకాణాల్లో రూ.10కోట్ల విలువైన సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
Post Views: 7








