Mahaa Daily Exclusive

  ఢిల్లీ లాఠీ చార్జి కి నిరసనగా కారేపల్లిలో డివైఎఫ్ఐ ప్రదర్శన..

Share

  • ఢిల్లీ లాఠీ చార్జి కి నిరసనగా కారేపల్లిలో డివైఎఫ్ఐ ప్రదర్శన
  • మోడీ హయాంలో భ్రష్టు పట్టిన విద్యారంగం – సీపీఐ(ఎం)

కారేపల్లి, మహా : శాంతియుతంగా పార్లమెంటుకు లాంగ్ మార్చ్ చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై మోడీ ప్రభుత్వం లాఠీఛార్జ్, నీటి ఫిరంగులు, భాష్ప వాయు ప్రయోగించడాన్నినిరసిస్తూ కారేపల్లిలో మంగళవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో నిరసన సభను డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈసభలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర లు మాట్లాడుతూ దేశంలో విద్యారంగం అద్వాన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జాతీయ పరీక్షల లీకేజీలకు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని నెల రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు పోరాటాలు నిర్వహిస్తున్నా మోడీ ప్రభుత్వం కనీసం స్పందించటం లేదన్నారు. మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సామాజికవేత్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవటంతో యువత శాంతియుతంగా పార్లమెంట్ కు మార్చ్ పిలునిచ్చిందన్నారు. నిరసన తెల్పుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్, నీటి పిరంగులు, భాష్ప వాయు గోళాలు ప్రయోగించడం మోడీ ప్రభుత్వ నిరంకుశ తత్వానికి నిదర్శనమని విమర్శించారు. మోడీ అధికారంలో వచ్చిన 12 సంవత్సరాల కాలంలో 14 ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని దీంతో రూ.లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకొని తర్పీదు పొందిన యువత సమయం,వయస్సు, వారి తల్లిదండ్రుల కష్టం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల లీకేజీలతో జీవితంపై భరోసా లేక అనేకమంది ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకుల దొంగలపై అరకొర చర్యలు తప్ప విద్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి పై కనీసం చర్యలు తీసుకోకపోవడం మోడీ ప్రభుత్వ చిత్తశుద్ది శంకించాల్సి వస్తుందన్నారు. విద్యావ్యవస్ధపై ప్రభుత్వ తీరుపై అసంతృప్తి తోటే పార్లమెంట్ మార్చ్ కు పూనుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ నాయకులు చిలుముల భరత్, కాకాటి పృద్వి, వెంకీ,నవీన్ ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.