- 24న కోటమైసమ్మతల్లి జాతర దుకాణాలకు వేలం
- జాతర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ సమాయత్తం
కారేపల్లి, మహా : ఇల్లందు ఏరియాలో ప్రసిద్ది చెందిన పెద్ద జాతర ఉసిరికాయలపల్లికోటమైసమ్మతల్లి జాతర. దసరా సందర్బంగా ఐదు రోజుల పాటు నిరాటంకం జరిగే జాతర ఏర్పాట్లకు దేవాదాయశాఖ అధికారులు సమాయత్తం అయ్యారు. దానిలో భాగంగా దసరా సందర్బంగా ఆలయ ప్రాంగణంలో 11 రోజుల పాటు దుకాణాలు, ఏర్పాటు చేసుకోవటానికి బహిరంగ వేలం పాటలను ఈనెల 24వ తేదిన నిర్వహించటం జరుగుతుందని ఆలయ ఈవో కటుకూరి వెంకటయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభి రామారావు లు ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రీ అమ్మకాలకు, లడ్డు, పులిహోరా దుకాణానికి, పుట్నాలు, పేలాలు అమ్ముకోవటానికి, కొబ్బరి చిప్పలు ప్రోగుచేసుకునే హక్కు, మిఠాయి దుకాణం, ఐస్ క్రీమ్ లు అమ్ముకోవటానికి వంటి 6 అంశాలపై వేలం పాటను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వేలంపాటకు ధరావతు సొమ్ము చెల్లించి పాటలు పాల్గొనవలసి ఉంటుందని వారు పేర్కొన్నారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రీ అమ్మకాలకు రూ.లక్ష, లడ్డు, పులిహోరా దుకాణానికి రూ.50 వేలు, పుట్నాలు, పేలాలు అమ్ముకోవటానికి రూ.30వేలు, కొబ్బరి చిప్పలు ప్రోగుచేసుకునే హక్కు కు రూ. 30వేలు, మిఠాయి దుకాణం కు రూ. 30 వేలు, ఐస్ క్రీమ్ అమ్మకాలకు రూ.30 వేలు డిపాజిట్ చేసి వేలంకు హాజరు కావాల్సి ఉంటుందనితెలిపారు. హెచ్చు పాటదారులకు హక్కులు కల్పించటం జరుగుతుందని వారి తెలిపారు.








