- యువనేత అభిషేక్ రెడ్డి నేతృత్వంలో యువ చైతన్యానికి నాంది!
- ఒకే వేదికపై మోటివేషన్ కెరీర్ అవగాహన…
- ఆకెళ్ళ రాఘవేంద్ర మోటివేషనల్ సెషన్…
- ఉద్యోగావకాశాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన…
- సోషల్ మీడియా సద్వినియోగంపై ప్రజెంటేషన్…
- గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం…
ఇబ్రహీంపట్నం జూలై 21 మహా:
యువనేత మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి నేతృత్వంలో యువతకు స్ఫూర్తినిచ్చే “యువ చైతన్య వేదిక” కార్యక్రమం ఈనెల 23న గురువారం బొంగ్లూర్ క్రాస్ రోడ్లోని ప్రమీద గార్డెన్స్ వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి తెలిపారు.. గురువారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ళ రాఘవేంద్ర పాల్గొని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా, లక్ష్యసాధన దిశగా ముందుకు నడిపించేలా విలువైన సందేశాలను అందించనున్నారని అభిషేక్ రెడ్డి అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి యువతకు అత్యంత అవసరమైన ఉద్యోగ అవకాశాలు, డ్రగ్స్ మహమ్మారి నిర్మూలన, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునే విధానం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. యువత ఉత్సాహంగా పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన కోరారు.








