- భవన నిర్మాణ నిబంధనలు పాటించాల్సిందే
- ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవు
- బల్దియా కమిషనర్ టి. వెంకన్న
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి క్షేత్రస్థాయి పరిశీలనలు
కార్పొరేషన్, మహా;
భవన నిర్మాణ నిబంధనలను పక్కాగా పాటించిన వాటికే అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు.
శనివారం ఫాతిమా నగర్, డి-మార్ట్ (కాజీపేట), ఎక్సైజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం నిర్మిత భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ చట్ట నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పరిశీలనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్, టీపీఎస్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.








