Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ఎదుట స‌మ‌గ్ర శిక్ష ఉద్యోగుల ధ‌ర్నా

Share

ఆదిలాబాద్, మ‌హా: సమగ్ర శిక్షలోని 18 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని గత 21 రోజులుగా ఉద్యోగులు వివిధ ర‌కాలుగా సమ్మె నిర్వ‌హిస్తున్నారు. శ‌నివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాసరెడ్డి క్యాంపు కార్యాల‌యానికి వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగులు క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా చేప‌ట్టారు. ప్ర‌భుత్వం తమ‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని నినాదాలు చేశారు. ఎండ‌లో కింద కూర్చున్న ఉద్యోగుల‌కు ఆఫీస్ సిబ్బంది వాట‌ర్ బాటిళ్ల ద్వారా తాగునీరు అందించారు. కంది శ్రీ‌నివాసరెడ్డి స్థానికంగా అందుబాటులో లేకపోవ‌డంతో వ‌న్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ఆయ‌న‌తో ఫోన్‌లో మాట్లాడించ‌డంతో ఉద్యోగులు త‌మ నిర‌స‌నను విర‌మించారు.

Latest