ఎల్బీనగర్, జనవరి 10, మహా: సంక్రాంతి సందర్భంగా స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ లోని విజయవాడ బస్టాఫ్ తో పాటు అటుగా వెళ్లే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.ఆంధ్రాకు వెళ్లేందుకు ఎల్బీ నగర్ ప్రధాన ముఖద్వారం అవ్వడంతో విజయవాడ బస్టాఫ్ వద్ద అటు ఎపిఎస్ ఆర్టీసీ,ఇటు టీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చి పోయే బస్సుల అప్డేట్స్ ఇస్తున్నారు.ఇది ఇలా ఉండగా అటుగా స్వంత వెహికల్స్ పై ప్రైవేట్,ఆర్టీసీ బస్సులలో వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైపై భారీ ట్రాఫిక్ స్థంభించింది. రాత్రి 12గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు ఒక ట్రాఫిక్ డిసీపీ ఇద్దరు ఎసిపిలు ముగ్గురు ఐదుగురు సీఐలు సుమారు 70మంది సిబ్బంది విధులు నిర్వహించి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ తమ దోపిడీని అడ్డుకునే వారు లేకపోవడంతో నోటికి వచ్చిన ఫిగర్ చెప్తూ దండుకుంటున్నారు.చిన్న పిల్లలతో అక్కడికి వచ్చిన వారు చేసేది లేక దిక్కు తోచని స్థితిలో ఆ వెహికల్స్ లొనే వెళ్తున్నారు.






