Mahaa Daily Exclusive

  వ‌ర్గీక‌ర‌ణతోనే న్యాయం: ఎమ్మార్పీఎస్

Share

మంచిర్యాల‌, మ‌హా: ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణతోనే న్యాయం జ‌రుగుతంద‌ని ఎమ్మార్పీఎస్ నాయ‌కులు అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ మాదిగల 30 ఏళ్ల కల అని వారు పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు వర్గీకరణపై సానుకూల తీర్పు ఇచ్చినా గానీ తెలంగాణలో వర్గీకరణను కొందరు స్వార్థపరులు అడ్డుపడటం సబ‌బుకాద‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రేగుంట చంద్రశేఖర్, మంత్రి బాపన్న, తిరుపతి, నిట్టూరి సారయ్య, కొప్పర్తి రవి, రామగిరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest