శబరిమల అయ్యప్ప సన్నిధానంలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకరజ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
మకర సంక్రాంతి పర్వదినానికి శబరిమల సిద్ధమైంది. ‘తంకా అంకి’ ఊరేగింపు అయ్యప్ప భక్తులకు చాలా ముఖ్యమైంది. అయ్యప్ప విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు ఆభరణాలే తంకా అంకి. 1970వ దశకంలో 453 సవర్ల బరువున్న బంగారు ఆభరణాలను ట్రావెన్ కోర్ సంస్థానం అయ్యప్పకు సమర్పించింది. మండలం, మకరవిళక్కు సమయంలో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ సమయంలో గరుడ పక్షి ఆభరణాలను అనుసరిస్తూ శబరిమలకు వస్తుంది.
Post Views: 97








