లండన్ లోని ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ నుంచి డిస్టింక్షన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వర్షా రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ జగన్ ట్వీట్ ను కోట్ చేస్తూ సుజనా చౌదరి పోస్ట్ చేశారు. క్షణాల్లో ఇది వైరల్ అయింది. జగన్ అభిమానులు థాంక్యూ సుజనా చౌదరి గారు అంటూ కామెంట్లు చేయగా.. టిడిపి సానుభూతిపరులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా? అంటూ కామెంట్స్ పెట్టారు.
కొద్దిసేపటికి పోస్ట్ డిలీట్
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. కాసేపట్లోనే సుజనా చౌదరి( Sujana Chaudhari ) తన పోస్టును డిలీట్ చేశారు. అయితే రాజకీయాలు వేరు.. వ్యక్తిగత అభినందించుకోవడం వేరు. ఈ విషయంలో సుజనా చౌదరి చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఆయన జగన్ కు వ్యక్తిగతంగా పెట్టబోయి.. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే డిలీట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.








