గత ఐదేళ్లలో రాష్ట్రంలో దారుణమైన పాలన అందించిన వైసీపీ(YCP)ని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినప్పటికి బుద్ధి మారలేదని.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Power Minister Gottipati Ravikuma) విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ.. కూటమి పార్టీపై విషప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు. గత కొద్ది రోజులగా.. వైసీపీ నేతలు(YCP leaders) మీడియా ముసుగులో విష ప్రచారం(Poison propaganda) చేస్తున్నారని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగుస్తున్నామని విష ప్రచారం చేసినప్పటికి అది బెడిసికొట్టిందన్నారు. అలాగే ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్(Free electricity) ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారం చేస్తున్నారని త్వరలో ఈ ప్రచారంపై కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి చురకలు అంటించారు
Post Views: 57








